నమస్తే

స్వాగతం

NighaSurya కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

వార్తలు

38 వార్తలు కనుగొనబడ్డాయి

వార్తలు

ప్రభుత్వ ఎక్స్ గ్రేషియో చెక్కును బాధితలకు అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఫిషింగ్ హార్బర్ లో పలు సమస్యల పై అసెంబ్లీలో చర్చించిన ఎమ్మెల్యేవిశాఖ దక్షిణం,న్యూస్ వన్ ప్రతినిధి :సముద్రంలో మత్స్య వేటకు వెళ్లి మరణించిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో చెక్కును దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ శివాజీ పాలెం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. నియోజకవర్గ పరిధిలో లో చెంగలరావు పేట కు చెందిన సురాడ తమ్మయ్య ,కోడి పంద్యాల వీధికి చెందిన బెవర పోలరాజు మారుపల్లి అప్పన్న గారికి ఒక్కరికి 5 లక్షలు చొప్పున అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు .అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు తమకున్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జేడీ ఫిషరీస్ లక్ష్మణరావు , బోటు అసోసియేషన్ పెద్దలు లక్ష్మణరావు , కూటమి 37 వార్డు అధ్యక్షులు రవి , వార్డు కూటమి ఇంచార్జి భాను , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వేదుల ప్రసాద్ (విశాఖ దక్షిణం)· 9 నెలల క్రితం
వార్తలు

రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఘ‌న స్వాగ‌తం

విశాఖపట్నం న్యూస్ One: విశాఖ జిల్లాలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐ.ఎఫ్.ఆర్.) కార్యక్రమాలలో పాల్గొనుటకు   మంగళవారం రాత్రి వాయుమార్గం ద్వారా  నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు మరియు అధికారుల నుంచి ఘ‌న స్వాగ‌తం లభించింది.ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన వారిలో పార్లమెంటు సభ్యులు M. శ్రీ భరత్, GVMC కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ G. విద్యాధరి, DCP మేరీ ప్రశాంతి, VMRDA కమిషనర్ తేజ్ భరత్ , నేవి అధికారులు   ఘన స్వాగ‌తం ప‌లికారు.

Rajesh Indukuri · 9 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

జీవీఎంసీ పరిధిలో అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించండి

 మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో అసంపూర్ణంగా ఉన్న అనధికార లేఔట్ లలో ఎల్ఆర్ఎస్ అనుమతుల మంజూరుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, నగరంలో గల అటువంటి  అనధికారిక లేఔట్లను క్షుణంగా పరిశీలించి నివేదికను సిద్ధం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశించారు . గురువారం ఆయన మధురవాడ జోన్  కొమ్మాది విలేజిలో ఎ బి కె రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన అనధికారిక లే అవుట్ ను జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ కే.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శబ్నం శాస్త్రి తో కలిసి పరిశీలించారు.మధురవాడ జోన్, కొమ్మాది విలేజ్ లో సర్వేనెంబర్ 36,37 పార్ట్,65,66,67,68,69 పార్ట్,72,73 పార్ట్,88,89,90,91పార్ట్ సర్వే నంబర్ల లో 14.4  ఎకరాలలో 163 ప్లాట్లతో ఎ బి కె రియల్ ఎస్టేట్ సంస్థ వేసిన లేఔట్ లో ఎల్ఆర్ఎస్ మంజూరు కొరకు దరఖాస్తు చేసిన స్థల యజమానుల ప్లాట్లను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో సంబంధిత అనధికారిక లేఔట్ లో అంతర్గత రోడ్లు మిగిలిన రహదారులకు అనుసంధాన పరచనందున అసంపూర్ణంగా లేఔట్ ఉందని గమనించిన కమిషనర్ సంబంధిత లేఔట్ యజమానితో ఫోన్లో మాట్లాడుతూ అందుకు గల కారణాలపై ఆరా తీశారు. ఆ లేఔట్ లో కొనుగోలు చేసిన  స్థల యజమానులు ఎల్ఆర్ఎస్ పథకం మంజూరు కొరకు 83 మంది స్వయంగా దరఖాస్తు చేసుకున్నారని, అందులో 75 స్థలాల ఎల్ఆర్ఎస్ అనుమతుల మంజూరుకు సంబంధించి పరిశీలనకు రావడం జరిగిందని, స్థల యజమానులు సౌకర్యార్థం లేఔట్ లో రోడ్లు అనుసంధాన పరచనందున రాష్ట్ర ప్రభుత్వం  కల్పించిన ఎల్ఆర్ఎస్ మంజూరుకు స్థల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారని, అనుమతుల మంజూరుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. వెంటనే లేఔట్ లో గల రోడ్లను ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసే ప్రక్రియ జరిపి అభివృద్ధి పరచాలని, అలా కాని ఎడల చట్టపరమైన కఠిన చర్యలు చేపడతామని కమిషనర్ రియల్ ఎస్టేట్ యజమానికి హెచ్చరించారు. విశాఖ నగరంలో ఉన్న అనధికార లేఔట్లను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియ చేపట్టి నివేదికను సిద్ధం చేయాలని,  ఎల్ఆర్ఎస్ మంజూరుకు అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని డిసిపి వెంకటేశ్వరరావుకు , ఫోన్ ద్వారా జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ .ప్రభాకర రావు కు కమిషనర్ ఆదేశించారు. 

Rajesh Indukuri · 9 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

సబ్బవరం డిడి న్యూస్ : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సబ్బవరం లో ఈరోజు జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామచంద్ర పాల్గొని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ మరియు ఏ సంబంధిత పత్రం లేకుండా, బండి నడపకూడదని తగుచూచనలతో పాటు ప్రమాదం జరిగితే ఏ విధమైనటువంటి స్థాయిలో విద్యార్థులు, సహాయం చేయాలో అనేక రకాలైనటువంటి సోదాహరణలతో ఈ కార్యక్రమంలో విద్యార్థులని చైతన్యవంతం చేశారు.. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి గ్రూపులోనే విలాసవంతమైన జీవితం కొరకు ఆనందం కొరకు స్పీడ్ అనేదాన్ని ప్రాణాల మీదకు తీసుకొని వస్తువు కుటుంబాలతో చలగాటలాడుతున్న యువత ఈ యొక్క అవగాహన కార్యక్రమం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా విద్యార్థులకు హితోపలికారు.. ఈ కార్యక్రమంలో కళాశాల వయసు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ, కుమారి రజిని మరియు జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి గలీజ్ లెక్కల తదితరులు పాల్గొన్నారు.

Rajesh Indukuri · 9 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అక్కయ్యపాలెం సచివాలయ ఉద్యోగి పైలా రాజేష్.

విశాఖపట్నం ( న్యూస్ వన్ ప్రతినిధి ) మార్చి 23  :  విశాఖ లో అక్కయ్యపాలెం సచివాలయం 125  లలితా నగర్ సచివాయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80వేలు లంచం తీసుకుంటూ ఉండగా వార్డు ఎడ్యుకేషన్ కం డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ ను సచివాలయం లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. లలితా నగర్ లో నివాసం ఉంటున్న ద్వారాపురెడ్డి గంగ రాజ్యం అతని కుమారుడు గణేష్ కి రాసిన స్థిరాస్తి సెటిల్ మెంట్ డీడ్ ప్రాసెస్ చేయడానికి 90వేలు లంచం డిమాండ్ చేయగా 80వేలకు ఒప్పందం కుదిరింది.. లంచం ఇవ్వడం ఇష్టం లేని గణేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. దీనితో రాజేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, కోర్ట్ లో హాజరు పరచనున్నారు.. ఈ దాడుల్లో డి ఎస్ పి లు రమణ మూర్తి, హర్షిత, సి ఐ లు శ్రీనివాస్, వెంకట రావు సిబ్బంది పాల్గొన్నారు.. 1064 టోల్ ఫ్రీ ద్వారా ఏసీబీ నీ సంప్రదించ వచ్చు అని అధికారులు తెలిపారు

SARATH BABU · 8 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
ప్రకటన (Advertisement)
వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం..నెలాఖరున వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 28 వరకు తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటగా, నెలాఖరుకు గరిష్ఠంగా 40 డిగ్రీలకు చేరే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు

Rajesh Indukuri · 9 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

మౌనిక హత్య కేసులో కొత్త కోణం

వడ్లపూడి :  విశాఖపట్నం గాజువాకలో జరిగిన యువతి మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదట సాధారణంగా కనిపించిన ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు బయటకు రావడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మార్చి 29న మౌనికను ఆమె ప్రియుడు రవీంద్ర హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు రవీంద్రను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా పోలీసులు మరో ఇంటిని తనిఖీ చేయగా, అక్కడ కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో ఈ హత్య కేసు మరింత క్లిష్టంగా మారింది. నిందితుడు హత్య అనంతరం లొంగిపోవడం కూడా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ హత్యను రవీంద్ర ఒక్కడే చేశాడా? లేక మరెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర స్నేహితుడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మౌనికను రవీంద్ర తన నివాసంలోనే హత్య చేశాడా? లేక వేరే ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు రీ-ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కేసులో మరెవరెవరి హస్తం ఉందనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, పోలీసులు త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.

MURALI · 7 నెలల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
వార్తలు

డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణం

సీపీఐ జాతీయ నేత నారాయణహైదరాబాద్ : అమెరికాకు ఎవరు ఎదురు తిరిగినా వారిపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడులకు దిగడం దారుణమని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్దం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇరాన్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకునే ప్రయత్నంగా యుద్దం చేస్తుందన్నారు. దురాక్రమణ చేసేందుకే పలు కారణాలు చూపి యుద్దం ప్రారంభించిందని అమెరికాపై మండిపడ్డారు. ప్రధాని మోడీ చొరవ తీసుకుని ప్రపంచ దేశాల సమన్వయంతో ట్రంప్‌తో మాట్లాడి యుద్దం ఆపేలా ప్రయత్నం చేయాలని కోరారు.భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణాకు ఇవ్వాలని సీపీఐ తరపున కోరుతున్నామని నారాయణ తెలిపారు. ధార్మిక సంస్థల్లో కఠినమైన పాలసీలు తీసుకురావటం ద్వారానే లడ్డూ కల్తీ లాంటి సమస్యలు ఆగుతాయని‌ స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిజాయితీగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని, శ్రీలక్ష్మి చేసిన చిన్న తప్పిదం వలన ఆమె కెరీర్ దెబ్బతిందన్నారు. బాద్యతాయుతంగా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రలోభాలకు లొంగడంతోనే వ్యవస్తలు దెబ్బతింటున్నాయని‌ ఆవేదన వ్యక్తం చేశారు.కాకినాడ లో జరిగిన దుర్ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని నారాయణ పేర్కొన్నారు. కల్తీ పాలు తాగటం వలన ప్రజలు చనిపోతున్నారని, డెయిరీలపై ప్రభుత్వ నియంత్రణ ఏమైందని ప్రశ్నించారు. నక్సలైట్లను చంపవచ్చు కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరన్నారు. పేదరిక నిర్మూలన జరిగితే నక్సలిజం అవసరమే రాదన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అణగదొక్కాలని అవినీతి మరక అంటించారని‌ ఆరోపించారు. ప్రధాని మోడీ, అమిత్ షా కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఆరు వేల కోట్లు ఉన్నాయని.. రెండు వేల కోట్లు విడుదల చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ కేసును సీఎం చంద్రబాబు మధ్యవర్తిత్వానికి అప్పగించాలని‌ నారాయణ కోరారు.

KARTHIK · 9 నెలల క్రితం · Telangana, Hyderabad
వార్తలు

కోనసీమ ప్రజల గుండెల్లో జీఎంసీ బాలయోగి చిరస్థాయిగా నిలిచారు.

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.కొత్తపేట : కోనసీమ ముద్దుబిడ్డ, భారత లోక్ సభ మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి సేవలు అజరామరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం బాలయోగి వర్ధంతి సందర్భంగా ఆయన కొత్తపేట బస్టాండ్ సెంటర్ లో విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బండారు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరు ప్రఖ్యాతులు ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని కొనియాడారు. కోనసీమలో ఏ మూలకు వెళ్ళినా ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జాతీయ రహదారి రావడానికి, జొన్నాడ వద్ద, సిద్ధాంతం వద్ద నూతనంగా రెండు వారధులు ఏర్పడడానికి ఆయనే కారణమన్నారు. యానాం - ఎదుర్లంక వారధి, బోడసకుర్రు వారధుల నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అందరితో సఖ్యంగా ఉంటూ మన బాలయోగి, మనవారు అని పేరు తెచ్చుకున్నారన్నారు. ఒక దశాబ్ద కాలం పాటు వివిధ పదవుల్లో ప్రజా ప్రతినిధిగా సేవలందించి లోక్సభ స్పీకర్ గా ఉన్నత శిఖరాలకు చేరారన్నారు. వారి మీద అభిమానంతో వారి కుమారుడు హరీష్ మాధూర్ పార్లమెంటు సభ్యునిగా ఉన్నారన్నారు. ప్రజల హృదయాల్లో చిరకాలం బాలయోగి నిలిచి ఉంటారని కొనియాడారు. ఆయన బాటలో నడిచి కోనసీమ అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మధు గంట ( ఆలమూరు ) · 9 నెలల క్రితం · Andhra Pradesh, Kakinada
వార్తలు

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం మహోత్సవానికి సీఎం చంద్రబాబు కి ఆహ్వానం

విజయవాడ  : ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్ కలిసి ఆహ్వానపత్రిక అందించారు. స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చారు

JANARDHAN · 9 నెలల క్రితం · Andhra Pradesh, Guntur
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)