నమస్తే

స్వాగతం

NighaSurya కి స్వాగతం

Sign In / Register
హోమ్ రాజకీయం సినిమా వ్యాపారం వార్తలు దేవాలయాలు లీగల్ వార్తలు ఆరోగ్యం క్రీడలు నేరాలు-ఘోరాలు

అన్ని వార్తలు

88 వార్తలు కనుగొనబడ్డాయి

నేరాలు-ఘోరాలు

చర్చల్లో వెనక్కి తగ్గని ఇరాన్ !

ఇరాన్ : అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి)పై నియంత్రణ విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రాంతీయంగా పెద్ద యుద్ధం రాకుండా నిరోధించేందుకు జరుగుతున్న ఈ చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని ఇరుదేశాలు సంకేతాలు ఇచ్చాయి. తాజా చర్చల రౌండ్‌లో “కొన్ని మంచి సంకేతాలు” కనిపించాయని అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రూబియో తెలిపారు. అయితే అప్పుడే దీనిపై అతిగా ఆశలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ.. రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం అని విలేకరులతో అన్నారు. మరోవైపు, ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని, కానీ గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల మధ్య ఉన్న వ్యత్యాసాలు (అభిప్రాయభేదాలు) తగ్గుతూ వస్తున్నాయని ఇరాన్ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.అసలు వివాదమంతా ఇరాన్ తన సంపన్న యురేనియం నిల్వలను తన వద్దే ఉంచుకోవాలని పట్టుబట్టడం, అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిలో షిప్పింగ్ నిబంధనలపై తనకే పూర్తి అధికారం ఉండాలని కోరడం వల్లే వస్తోంది. ప్రపంచంలోని ప్రధాన చమురు, గ్యాస్ రవాణా ఈ జలసంధి గుండానే సాగుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న అధిక సంపన్న యురేనియం నిల్వలను అమెరికా ఏదో ఒక రోజు స్వాధీనం చేసుకుంటుందని అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రూబియో స్పష్టం చేశారు. ఈ యురేనియంను ఇరాన్ అణు ఆయుధాల తయారీకి వాడుతుందని అమెరికా నమ్ముతోంది. దానిని ఎలాగైనా సాధించి, ఆ తర్వాత నాశనం చేస్తాం తప్ప, ఇరాన్ దగ్గర మాత్రం ఉండనివ్వబోమని ట్రంప్ వైట్ హౌస్‌లో మీడియాతో వ్యాఖ్యానించారు.అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై ఎలాంటి పన్నులు (టోల్స్) గానీ, ఆంక్షలు గానీ విధించడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. అది అంతర్జాతీయ జలమార్గమని, ప్రపంచ షిప్పింగ్ కోసం అది ఎప్పుడూ స్వేచ్ఛగా, తెరిచే ఉండాలని డిమాండ్ చేశారు. కానీ, ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని చెప్తోంది. యురేనియం విషయంలో తగ్గేదే లేదన్నట్లుగా ఇరాన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దేశం దాటించి యురేనియంను బయటకు పంపకూడదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు హోర్ముజ్ జలసంధిపై కూడా ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని గట్టిగా వినిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ప్రాంతీయ మిత్రదేశాల మిలిటరీ చర్యల వల్ల అక్కడ భద్రతా వాతావరణం మారిపోయిందని, కాబట్టి తమ సముద్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.మరోవైపు తెరవెనుక జరుగుతున్న దౌత్య చర్చలను వేగవంతం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ త్వరలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ చర్చల ఆలస్యం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం నశిస్తోందని, అందువల్ల ఇరాన్-అమెరికా మధ్య సమాచార మార్పిడిని మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని చర్చల్లో పాల్గొంటున్న వర్గాలు తెలిపాయి. ఇరాన్ ఈ వారంలో అమెరికాకు ఒక కొత్త ప్రతిపాదనను పంపింది, కానీ అందులో గతంలో ట్రంప్ తిరస్కరించిన డిమాండ్లే ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల తొలగింపు, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల మరియు ప్రాంతం నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ వంటి పాత డిమాండ్లనే ఇరాన్ మళ్ళీ చేర్చింది. ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే, మళ్లీ ఇరాన్‌పై సైనిక దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. దానికి ప్రతిగా.. అమెరికా కనుక దాడులు చేస్తే, తమ ప్రతీకారం కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కాదని, చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విప్లవాత్మక బలగాలు (రివల్యూషనరీ గార్డ్స్) హెచ్చరించాయి. వారాల తరబడి చర్చలు జరుగుతున్నా, తాత్కాలిక కాల్పుల విరమణ ఉన్నప్పటికీ.. ఇరాన్ మాత్రం అణు ఆయుధ స్థాయికి దగ్గరగా ఉన్న యురేనియం నిల్వలను, క్షిపణులను, డ్రోన్ సామర్థ్యాలను అలాగే ఉంచుకోవడం అమెరికా, దాని మిత్రదేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది.

REHAMAN· 3 వారాల క్రితం
లీగల్ వార్తలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

జూన్‌ 1న నోటిఫికేషన్‌..ఏపీలో  నాలుగు స్థానాలుజూన్‌ 18న రాజ్యసభ ఎన్నికలు, అదే రోజు ఫలితాలున్యూ ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ జూలైలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభసభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. జూన్ 1న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నది ఎలక్షణ్ కమిషన్. కర్ణాటక నుంచి పదవీకాలం పూర్తవుతున్న రాజ్యసభ సభ్యులు.. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హెచ్డీ దేవగౌడ. మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయసింగ్ పదవీ కాలం ముగియనుంది.

CHANDU · 3 వారాల క్రితం
రాజకీయం

పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్ !

పాక్‌లో "కాక్‌రోచ్" పేరుతో కొత్త పార్టీలుపాకిస్థాన్‌ : సోషల్ మీడియాలో బొద్దింకల ట్రెండ్ మామూలుగా లేదు! ఒకప్పుడు కేవలం వ్యంగ్యం కోసం పుట్టిన ఒక చిన్న ఆలోచన.. ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి ఒక భారీ పొలిటికల్ మూవ్‌మెంట్‌లా మారుతోంది. భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ స్ఫూర్తితో.. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ ‘కాక్‌రోచ్ అవామీ పార్టీ’ ‘కాక్‌రోచ్ అవామీ లీగ్’ వంటి గ్రూపులు పుట్టుకొచ్చాయి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగ యువత చేస్తున్న కొన్ని ఉద్యమాలను ఉద్దేశించి “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అని వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తల ఆధారంగా మే నెల మధ్యలో ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత సీజేఐ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే సోషల్ మీడియాలో తుఫాన్ మొదలైపోయింది.అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తో పనిచేసిన అభిజీత్ దీప్కే.. మే 16న ఈ కాక్‌రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో లాంచ్ చేశాడు. గూగుల్ ఫామ్స్ ద్వారా మెంబర్‌షిప్ డ్రైవ్ కూడా మొదలుపెట్టాడు. “అవును, నేనే ఆ బొద్దింకను.. భారత ప్రధాన న్యాయమూర్తి సరిగ్గా నా గురించే మాట్లాడారు” అంటూ అభిజీత్ ‘ఇండియా టుడే’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 15 మిలియన్ల (1.5 కోట్లు) ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ విషయంలో దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారిక పేజీలను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. ఈ పార్టీ తనను తాను “సోమరిపోతులు, నిరుద్యోగ” యువత గొంతుకగా ప్రకటించుకుంది. కేవలం మీమ్స్‌తో నవ్వించడమే కాకుండా.. మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, మెరుగైన పబ్లిక్ సర్వీసెస్, అధికారులలో జవాబుదారీతనం వంటి తీవ్రమైన సామాజిక సమస్యలపై సైతం ఈ పార్టీ ప్రశ్నిస్తోంది. గురువారం నాడు ఈ పార్టీకి చెందిన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను భారతదేశంలో నిలిపివేసినప్పటికీ, వెంటనే సరికొత్త హ్యాండిల్‌తో రీ-ఎంట్రీ ఇచ్చి.. “మమ్మల్ని వదిలించుకోవచ్చు అనుకున్నారా? లోల్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ గ్రూప్ తమ పేరు మీద ట్రేడ్‌మార్క్ అప్లికేషన్లు కూడా పెట్టుకుంది. తమ వెబ్‌సైట్ ద్వారా లక్షలాది మంది సైన్-అప్ అవుతున్నారని క్లెయిమ్ చేస్తోంది. ఈ ఆన్‌లైన్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో.. ఈ బొద్దింక జ్వరం కాస్తా పాకిస్థాన్‌కు సైతం పాకింది. అక్కడ కూడా మెయిన్‌స్ట్రీమ్ రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ , నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్, పీపీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ ‘కాక్‌రోచ్ పార్టీలు’ రంగంలోకి దిగుతున్నాయి. పాకిస్థాన్‌లో మొదలైన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘కాక్‌రోచ్ అవామీ పార్టీ’.. తాము ఇండియా నుంచే ఈ ఐడియా కాపీ కొట్టామని ఓపెన్‌గా ఒప్పుకుంటూ, “కాపీ కొడితే ఏంటి, ఇద్దరి ముఖ్యాంశం ఒక్కటే కదా” అని తమ బయోలో రాసుకుంది. ప్రస్తుతం ఈ అకౌంట్‌కు 1,400 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాము ఏ ఒక్క వ్యక్తికో లేదా టీమ్‌కో సంబంధించిన వాళ్లం కాదని, పాకిస్థానీ ‘జెన్-జీ’ యువత అసలైన గొంతుకగా మారుతామని చెబుతున్నారు. ఇండియా లోగో లాగే ఉన్నప్పటికీ.. వీరు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌ను వాడుతున్నారు. మే 28న తమ అధికారిక నినాదాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ఎక్స్ (ట్విట్టర్) లోనూ దీనికి సంబంధించిన అకౌంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. అనే అకౌంట్.. “వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించిందో, మేము ఆ సామాన్య ప్రజల గొంతుకను” (జిన్హే సిస్టమ్ నే కాక్‌రోచ్ సంఝా, హమ్ ఉన్హీ అవామ్ కీ ఆవాజ్ హైన్) అని రాసుకొచ్చింది. అలాగే ‘కాక్‌రోచ్ అవామీ లీగ్ పాకిస్థాన్‌’ అనే మరో పేజీ.. “ఏ పరిస్థితిలోనైనా మేము బతికే ఉంటాం” (హర్ హలాత్ మే జిందా హైన్) అనే ఉర్దూ నినాదాన్ని వాడుతోంది. భారత్‌లోని కాక్‌రోచ్ జనతా పార్టీకి ఒక స్పష్టమైన వ్యవస్థాపకుడు, మ్యానిఫెస్టో, అఫీషియల్ వెబ్‌సైట్ ఉన్నాయి. కానీ పాకిస్థాన్‌లోని గ్రూపులు మాత్రం ఇంకా విడివిడిగా, రకరకాల క్రియేటర్ల ద్వారా నడుస్తున్నాయి. ఏదేమైనా.. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకుని బతికే ‘బొద్దింక’ను ఒక సింబల్‌గా వాడుకుంటూ, ఇరుదేశాల యువత తమ దేశాల్లోని నిరుద్యోగం, పాలనా లోపాలపై డిజిటల్ రూపంలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

KAMAL · 3 వారాల క్రితం · Andhra Pradesh
నేరాలు-ఘోరాలు

గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ట్రెయిన్ లో ఆకస్మిక తనిఖీలు

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, సుమారు 13కిలోల గంజాయి స్వాధీనం- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,విజయనగరం : జిల్లాలో గంజాయి, మద్యం, ప్రేలుడు సామగ్రి, డ్రగ్స్, గుట్కాలు అక్రమ రవాణ నియంత్రణకు మరియు అనుమానస్పద వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొనేందుకు ఒడిస్సా బ్రహ్మపుర నుండి విశాఖపట్నం ప్రయాణికులతో రద్దీగా వెళ్లే పాసింజరు ట్రెయిన్ నంబరు /58531 ను లక్ష్యంగా చేసుకొని మే 21న ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - జిల్లాలో మద్యం, గంజాయి, మందుగుండు, ప్రేలుడు, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణ నియంత్రణకు, అనుమానస్పద వ్యక్తులను అదువులోకి తీసుకొనే లక్ష్యంతో ఒడిస్సా బ్రహ్మపుర నుండి విశాఖపట్నం వెళ్ళే పాసింజరు ట్రెయిన్ /58531లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని జిల్లా ఎస్పీ తెలిపారు. చీపురుపల్లి రైల్వే స్టేషను నుండి నెల్లిమర్ల రైల్వే స్టేషను వరకు అధికారులు, సిబ్బంది, డాగ్ స్క్వాడుతో ట్రెయిన్లోని అన్ని కంపార్టుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, ప్రయాణికుల బ్యాగులు, వస్తువులను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నహాయంతో పరిశీలించారు. చీవురుపల్లి రైల్వే స్టేషనులో బ్రహ్మపుర విశాఖపట్నం వెళ్ళే పాసింజరు ట్రెయినును లక్ష్యంగా చేసుకొని పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారన్నారు. తనిఖీల్లో ట్రైన్ లో ప్రయాణించే పాసింజర్స్ కు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి, ఒక్కొక్క కంపార్టుమెంటును పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీలు చేపట్టే సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రైన్ ను చీపురుపల్లి రైల్వే స్టేషనులో ఎక్కువ సమయం నిలిపివేయకుండా, పోలీసు అధికారులు, సిబ్బంది నెల్లిమర్ల రైల్వే స్టేషనుకు చేరేంత వరకు ట్రైన్లో ప్రయాణించి, ప్రయాణికుల బ్యాగులు, లగేజ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేసామన్నారు. ఈ తనిఖీల్లో ఈగల్, జిఆర్పీ, సివిల్, ఎస్టీఎఫ్, బాంబ్ డిటెక్షన్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ కూడా పాల్గొన్నాయి. ఈ తనిఖీలు చేపట్టే ముందు ట్రైన్లో చేపట్టాల్సిన విధుల గురించి చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు చీపురుపల్లి రైల్వే స్టేషను వద్ద రైడ్స్ లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది, ఎస్టీఎఫ్, బాంబ్, డాగ్ స్క్వాద్ బృందాలకు దిశా నిర్ధేశం చేసారు. ఈ తరహా అకస్మిక తనిఖీలను భవిష్యత్తులో కూడా కొనసాగించి, నేర నియంత్రణకు ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణకు పాల్పదుతున్న ఇద్దరు వ్యక్తులను (1) కేరళ రాష్ట్రం కసర గాడ్ జిల్లా పారిపురం పోస్టు కొడవలుం గ్రామానికి చెందిన కొడవలం దేవినాధ్ (21 సం.లు) (2) కేరళ రాష్ట్రం యర్నాకులం జిల్లా కుట్టంపుజా పోస్టు వట్టటుపర గ్రామానికి చెందిన ఏదోతా పటమాటు జోసెఫ్ (21 సం.లు) అదుపులోకి తీసుకొని, వారివద్ద నుండి సుమారు 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వ్యక్తులను తదుపరి చర్యల నిమిత్తం పలాస జి.ఆర్.పి. పోలీసులకు అప్పగించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. తోటి ప్రయాణికులు పోలీసుల చర్యలను అభినందించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ తనిఖీలలో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, చీపురుపల్లి సిఐ జి.శంకరరావు, ఎస్ఐలు లోకేశ్వరరావు, లోకేష్, నారాయణరావు, మధుసూధనరావు, స్వీటీ, ఆర్పీఎఫ్, ఈగల్, ఎస్టీఎఫ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి.

SATISH · 3 వారాల క్రితం · Andhra Pradesh, Vizianagaram
దేవాలయాలు

అప్పన్న కొండపై వైభవంగా దేవస్థానం ధర్మకర్మల మండలి ప్రమాణస్వీకారం

​సింహాచలం, 21 మే 2026:శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్మల మండలి (ట్రస్ట్ బోర్డ్) ప్రమాణస్వీకార మహోత్సవం గురువారం కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యులచే శాస్త్రోక్తంగా ప్రమాణస్వీకారం చేయించారు.​ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మరియు నరసాపురం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆర్. కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్ (ఆన్‌లైన్) ద్వారా హాజరై, నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.​ప్రమాణస్వీకారం చేసిన ధర్మకర్మల మండలి సభ్యులు:​ పూసపాటి అశోక్ గజపతిరాజు (వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్)​మాకేన సీతారాం పాత్రుడు (నవీన్)కాసిరెడ్డి దామోదర్​చలమూరి భారతికారక దేవుడు​ కనకాల మురళీమోహన్ వెంపడాపు అన్నపూర్ణ​బీతాల నీరజ లక్ష్మీ కుమారి​మధుపద సన్యాసి రావు​ డాక్టర్ ధరణి బండ్ల​ నీతిపల్లి మహేష్​పెద్దిశెట్టి ఉష శ్రీ​లలిత జ్యోతి​గుత్తికొండ శ్రీలత​సుసరపు గణపతి రావు​చల్లాంగి జ్ఞానేశ్వరి​పావులూరి శ్రీనివాస రావు​ఎక్స్ అఫిషియో సభ్యులు:​గూడవర్తి శ్రీనివాస ఆచార్యులు (ఆలయ ప్రధాన అర్చకులు)​ప్రత్యేక ఆహ్వానితులు: బొక్కం స్వామి నాయుడు​ వేదుల దక్షిణామూర్తి​నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, సభ్యుల కుటుంబ సభ్యులు మరియు అభిమానులు పాల్గొన్నారు

RAJA BABU · 3 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
ప్రకటన (Advertisement)
ఆరోగ్యం

​నేటినుంచి జిల్లాలో "ఆపరేషన్ క్లీన్ స్వీప్"

జూన్ 20 వరకు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలుఇంచార్జి కలెక్టర్ ఎస్. సేధు మాధవన్​విజయనగరం, మే 21:                      రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర"  మహా యజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మే 22 నుండి జూన్ 20, 2026 వరకు నాలుగు వారాల పాటు ముమ్మర పారిశుధ్య డ్రైవ్ "ఆపరేషన్ క్లీన్ స్వీప్" నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ డ్రైవ్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.​నాలుగు వారాల కార్యాచరణ ప్రణాళిక  : ​స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 ప్రమాణాల ఆధారంగా ఈ డ్రైవ్‌ను నాలుగు వారాల పాటు నిర్వహించనున్నారు.​మొదటి వారం (మే 22 – మే 28): గత స్వచ్ఛ సర్వేక్షన్‌లో గుర్తించిన రెడ్, ఎల్లో బ్లాక్ స్పాట్ల నిర్మూలన, ప్రధాన రహదారులు, జంక్షన్ల క్లీనింగ్, రోడ్ మార్కింగ్స్ మరియు కర్బ్ పెయింటింగ్స్.​రెండవ వారం (మే 29 – జూన్ 4): వర్షాకాలానికి ముందే వరద కాలువలు, నాలాల పూడికతీత మరియు ఇరుకైన సందుల లోతైన శుభ్రత. మూడవ వారం (జూన్ 5 – జూన్ 11): నివాస, వాణిజ్య సముదాయాలలో 100% తడి-పొడి చెత్త వర్గీకరణ. బల్క్ వేస్ట్ ఉత్పత్తిదారులుచేత మేనేజ్‌మెంట్ నియమాల అమలు.నాల్గవ వారం (జూన్ 12 – జూన్ 20): అన్ని పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్ల సంపూర్ణ శానిటైజేషన్, చెత్త వేసే సమస్యాత్మక ప్రాంతాల  పూర్తి నిర్మూలన.​కఠిన చర్యలు - పారదర్శకత: ​నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు  ఉల్లంఘించే హోటళ్లు, మార్కెట్లు, కల్యాణ మండపాలపై కఠిన చర్యలు ఉంటాయి. అవసరమైతే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసే అధికారాలు కలెక్టర్లకు ఉన్నాయి.​జియో-ట్యాగింగ్: 'జియోస్టాట్ టీమ్' అనే థర్డ్-పార్టీ ఏజెన్సీ ద్వారా పనులకు ముందు, తర్వాత  ఫోటోలను జియో-ట్యాగ్ చేసి రోజువారీ నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.​డ్యాష్‌బోర్డ్ పరిశీలన: మున్సిపల్ కమిషనర్లు వార్డుల వారీగా మైక్రో ప్లాన్స్ సిద్ధం చేసి, ప్రతి రోజు రాత్రి 8 గంటల లోపు వివరాలను ఎమ్‌ఐఎస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి.​గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యం: ​ఒకే రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీల్లో ఏకకాలంలో నిర్వహించిన అతిపెద్ద క్లీన్‌లీనెస్ డ్రైవ్‌గా దీనిని నిలిపి, "గిన్నిస్ వరల్డ్ రికార్డ్" సాధించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, జియోస్టాట్ బృందాలు డాక్యుమెంటేషన్  సిద్ధం చేస్తున్నాయి. ఈ రికార్డులో విజయనగరం జిల్లా ముందుండాలని ఇంచార్జి కలెక్టర్ పిలుపునిచ్చారు. ​ఈ డ్రైవ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఉత్తమ మున్సిపాలిటీలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు మరియు ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు.

RAJ · 3 వారాల క్రితం · Andhra Pradesh, Vizianagaram
దేవాలయాలు

వైభవంగా శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవి ప్రమాణ స్వీకారం!

ఓల్డ్ టౌన్ : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఆంధ్ర ప్రదేశ్ ధార్మిక పరిషత్ వారి ఉత్తర్వులు అనుసరించి విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలిని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సి హెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ మరియూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ధర్మ కర్తల మండలి సభ్యులచే పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మ కర్తల మండలి సభ్యులుగా సురాడ రాజ్ కుమార్, బుదిరెడ్ల సత్యనారాయణ, రాయ రాము, ఉప్పలపు ఆదిలక్ష్మి, సరిపల్లి జ్యోతి, పుక్కల కళ్యాణి, మానేపల్లి రమణి, నాగమల్లి భాస్కర రావు, బోనగిరి విజయదుర్గ, మంత రాజశేఖర్, మంత్రి శాలివాహన్ మరియు ఎక్స్- అఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి జగన్నాథ ఆచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ గా సురాడరాజ్ కుమార్ ని పై సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సభ్యులందరినీ అభినందిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఆలయ పరిరక్షణకై శ్రమిస్తూ భక్తుల మన్నలను పొందెలాగ కూటమి ప్రభుత్వమునకు, దేవాలయానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీస్కొనిరావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్ రెడ్డి, శ్కందులనాగరాజు, మాసిపోగురాజు, కోరుకొండ ప్రసాద్ కేదారి లక్ష్మి , మజ్జి త్రినాథ్, గోడి నరసింహచారి, ఓదూరు శివయ్య మరియు ఇతర రాజకీయ ప్రముఖులు, ధర్మకర్తల మండలి వారి బంధువులు, మిత్రులు సమక్షమున ప్రమాణ స్వీకారం దిగ్విజయంగా జరిగింది. పాల్గొన్న అందరికీ ప్రసాదం, మజ్జిగ, అందచేయగా దేవస్థానం ఏర్పాట్లు పై అందరూ హర్షం వ్యక్తంచేశారు.

PRASAD · 3 వారాల క్రితం · Andhra Pradesh, Visakhapatnam
నేరాలు-ఘోరాలు

ఇజ్రాయెల్‌ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్‌

( న్యూస్ వన్ ప్రత్యేక ప్రతినిధి )అమెరికా అధ్యక్షుడు  మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు తెరలేపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన ఘాటు వ్యాఖ్యలు, వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే ట్రంప్ ఈసారి ఇజ్రాయెల్ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇజ్రాయెల్‌లో తనకు అపారమైన ప్రజాదరణ ఉందని, అవసరమైతే అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసినా గెలవగలనని ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.                ఈ మేరకు మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రధాని పై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు ఎంతో మంచి నాయకుడని, తాను చెప్పిన విషయాలను గౌరవిస్తారని తెలిపారు. "నెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో ఆయనకు దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కడం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలపై మరోసారి చర్చకు దారితీశాయి."ఇజ్రాయెల్‌లో నాకు 99 శాతం మద్దతు"అలానే ఇంకా మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, పలువురు రాజకీయ విశ్లేషకులు వీటిని ట్రంప్ ప్రత్యేక రాజకీయ శైలిగా అభివర్ణిస్తున్నారు.ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒక విదేశీ దేశ రాజకీయాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఈ స్థాయిలో వ్యాఖ్యానించడం అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య రాజకీయాల్లో అమెరికా పాత్ర, ఇజ్రాయెల్‌కు ట్రంప్ గతంలో ఇచ్చిన మద్దతు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.ఇరాన్‌కు మరో హెచ్చరిక ;ఇదే సమావేశంలో Iranతో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో తనకు ఎలాంటి తొందర లేదని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాల్సిన అవసరం ఉందని, ప్రపంచ చమురు సరఫరాకు అది అత్యంత కీలకమని పేర్కొన్నారు. అదేవిధంగా, "ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది" అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అమెరికాలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ రాజకీయాల్లో తన ప్రభావం ఇంకా కొనసాగుతోందని చూపించాలనే ప్రయత్నంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్‌కు ట్రంప్ గతంలో బలమైన మద్దతు ఇచ్చారు. జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం, అమెరికా రాయబార కార్యాలయాన్ని అక్కడికి మార్చడం వంటి నిర్ణయాలతో ఆయన ఇజ్రాయెల్‌లోని కుడిపక్ష వర్గాల్లో మంచి గుర్తింపు సంపాదించారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి. ఆయన వ్యాఖ్యలు సరదాగా చేసినవా, లేక రాజకీయ సంకేతాలా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. ట్రంప్ ఎక్కడ మాట్లాడినా, ఏ వ్యాఖ్య చేసినా ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో మాత్రం ఎప్పటిలాగే విజయవంతమవుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి

CRIME BEURO · 3 వారాల క్రితం
నేరాలు-ఘోరాలు

ఎయిరిండియాకు తప్పిన ప్రమాదం

బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు, సిబ్బందిబెంగళూరు : ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఎయిరిండియాకు పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. అనంతరం విమానాన్ని తక్షణమే గ్రౌండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఎయిరిండియా AI2651 విమానం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చింది. విమానం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’‌కు చోటుచేసుకున్నట్లు ఎయిరిండియా సంస్థ తెలిపింది. అంటే విమానం వెనుక భాగం రన్‌వేపై తగిలినట్లు అర్థం. ఈ ఘటన తర్వాత విమానాన్ని పూర్తి స్థాయి సాంకేతిక తనిఖీల కోసం సేవల నుంచి తప్పించారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అందరినీ సురక్షితంగా విమానం నుంచి దించేశారు. ఇక బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. బెంగళూరులోని గ్రౌండ్ సిబ్బంది అవసరమైన సహాయం అందిస్తున్నారని తెలిపింది.ఈ ఘటనపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా మొదటి ప్రాధాన్యత’’ అని పేర్కొన్నారు. అలాగే నియమావళి ప్రకారం సంబంధిత నియంత్రణ సంస్థలతో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.టెయిల్-స్ట్రైక్ అంటే ఏమిటి?ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో విమానం తోక భాగం రన్‌వేను తాకడాన్ని టెయిల్-స్ట్రైక్ అంటారు. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం మరీ ఎక్కువగా పైకి వంగినప్పుడు లేదా సమతుల్యత కోల్పోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ సంఘటన విమానానికి నష్టం కలిగించగలదు. ప్రమాదకరమైనది కూడా. అందువల్ల ఇటువంటి సందర్భాల్లో విమానానికి క్షుణ్ణమైన సాంకేతిక తనిఖీ అవసరం అని తెలుస్తుంది.

SHARAMA · 3 వారాల క్రితం
లీగల్ వార్తలు

కాక్రోచ్ "ఎక్స్" అకౌంట్ నిలిపివేత

( న్యూస్ ప్రత్యేక ప్రతినిధి )ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పొలిటికల్ శటైరికల్ అకౌంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి గట్టి షాక్ తగిలింది. భారతీయ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ అకౌంట్‌ను భారత్‌లో ఎక్స్ (ట్విట్టర్) సంస్థ నిలిపివేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ అకౌంట్, ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (BJP) ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. ఈ రేంజ్‌లో దూసుకుపోతూ, మంచి మొమెంటం అందుకుంటున్న సమయంలోనే ఈ అకౌంట్‌పై నిషేధం పడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. తన ఎక్స్ ఖాతాను ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తున్న పాప్-అప్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ, “మనం ముందే ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఇండియాలో విత్‌హెల్డ్ చేశారు” అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఎక్స్‌లో `@CJP_2029` అనే యూజర్‌నేమ్‌తో ఉన్న ఈ అకౌంట్‌ను ఓపెన్ చేస్తే.. ‘అకౌంట్ విత్‌హెల్డ్’ అని బోల్డ్ అక్షరాలతో కనిపిస్తోంది. అంతేకాదు, ఒక చట్టపరమైన డిమాండ్ (లీగల్ డిమాండ్) కు స్పందనగా భారతదేశంలో ఈ అకౌంట్‌ను నిలిపివేసినట్లు అక్కడ స్పష్టంగా రాసి ఉంది.అసలు ఈ అకౌంట్‌ను ఎందుకు నిలిపివేశారనే విషయానికి వస్తే.. ఎక్స్ సంస్థ నిబంధనల ప్రకారం ఏదైనా అధికారిక సంస్థ లేదా ప్రభుత్వం నుంచి సరైన చట్టపరమైన అభ్యర్థన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినా లేదా చట్టపరమైన ఆదేశాలు వచ్చినా.. ఆయా దేశాల పరిధి వరకు మాత్రమే సదరు కంటెంట్ లేదా అకౌంట్ కనిపించకుండా యాక్సెస్‌ను నిలిపివేస్తామని ఎక్స్ సంస్థ వివరించింది. చట్టపరమైన డిమాండ్ల వల్లే ఈ వ్యంగ్య పొలిటికల్ అకౌంట్‌పై ఇండియాలో ఈ విధమైన పరిమితి విధించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది.

PRASANNA · 3 వారాల క్రితం
ప్రకటన (Advertisement)
హోమ్
లైవ్ TV
ఈ-పేపర్
Loading Live...
లైవ్ TV (Live)