రాజకీయం
8 వార్తలు కనుగొనబడ్డాయి
రాజకీయం
పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్ !
పాక్‌లో "కాక్‌రోచ్" పేరుతో కొత్త పార్టీలుపాకిస్థాన్ : సోషల్ మీడియాలో బొద్దింకల ట్రెండ్ మామూలుగా లేదు! ఒకప్పుడు కేవలం వ్యంగ్యం కోసం పుట్టిన ఒక చిన్న ఆలోచన.. ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి ఒక భారీ పొలిటికల్ మూవ్‌మెంట్‌లా మారుతోంది. భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ స్ఫూర్తితో.. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ ‘కాక్‌రోచ్ అవామీ పార్టీ’ ‘కాక్‌రోచ్ అవామీ లీగ్’ వంటి గ్రూపులు పుట్టుకొచ్చాయి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగ యువత చేస్తున్న కొన్ని ఉద్యమాలను ఉద్దేశించి “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అని వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తల ఆధారంగా మే నెల మధ్యలో ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత సీజేఐ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే సోషల్ మీడియాలో తుఫాన్ మొదలైపోయింది.అమెరికాలో పబ్లిక్ రిలేషన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తో పనిచేసిన అభిజీత్ దీప్కే.. మే 16న ఈ కాక్‌రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో లాంచ్ చేశాడు. గూగుల్ ఫామ్స్ ద్వారా మెంబర్‌షిప్ డ్రైవ్ కూడా మొదలుపెట్టాడు. “అవును, నేనే ఆ బొద్దింకను.. భారత ప్రధాన న్యాయమూర్తి సరిగ్గా నా గురించే మాట్లాడారు” అంటూ అభిజీత్ ‘ఇండియా టుడే’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 15 మిలియన్ల (1.5 కోట్లు) ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ విషయంలో దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారిక పేజీలను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. ఈ పార్టీ తనను తాను “సోమరిపోతులు, నిరుద్యోగ” యువత గొంతుకగా ప్రకటించుకుంది. కేవలం మీమ్స్‌తో నవ్వించడమే కాకుండా.. మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, మెరుగైన పబ్లిక్ సర్వీసెస్, అధికారులలో జవాబుదారీతనం వంటి తీవ్రమైన సామాజిక సమస్యలపై సైతం ఈ పార్టీ ప్రశ్నిస్తోంది. గురువారం నాడు ఈ పార్టీకి చెందిన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను భారతదేశంలో నిలిపివేసినప్పటికీ, వెంటనే సరికొత్త హ్యాండిల్‌తో రీ-ఎంట్రీ ఇచ్చి.. “మమ్మల్ని వదిలించుకోవచ్చు అనుకున్నారా? లోల్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ గ్రూప్ తమ పేరు మీద ట్రేడ్‌మార్క్ అప్లికేషన్లు కూడా పెట్టుకుంది. తమ వెబ్‌సైట్ ద్వారా లక్షలాది మంది సైన్-అప్ అవుతున్నారని క్లెయిమ్ చేస్తోంది. ఈ ఆన్‌లైన్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో.. ఈ బొద్దింక జ్వరం కాస్తా పాకిస్థాన్‌కు సైతం పాకింది. అక్కడ కూడా మెయిన్‌స్ట్రీమ్ రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ , నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్, పీపీపీలకు ప్రత్యామ్నాయంగా ఈ ‘కాక్‌రోచ్ పార్టీలు’ రంగంలోకి దిగుతున్నాయి. పాకిస్థాన్‌లో మొదలైన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘కాక్‌రోచ్ అవామీ పార్టీ’.. తాము ఇండియా నుంచే ఈ ఐడియా కాపీ కొట్టామని ఓపెన్‌గా ఒప్పుకుంటూ, “కాపీ కొడితే ఏంటి, ఇద్దరి ముఖ్యాంశం ఒక్కటే కదా” అని తమ బయోలో రాసుకుంది. ప్రస్తుతం ఈ అకౌంట్‌కు 1,400 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాము ఏ ఒక్క వ్యక్తికో లేదా టీమ్‌కో సంబంధించిన వాళ్లం కాదని, పాకిస్థానీ ‘జెన్-జీ’ యువత అసలైన గొంతుకగా మారుతామని చెబుతున్నారు. ఇండియా లోగో లాగే ఉన్నప్పటికీ.. వీరు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌ను వాడుతున్నారు. మే 28న తమ అధికారిక నినాదాన్ని ప్రకటిస్తామని తెలిపారు.ఎక్స్ (ట్విట్టర్) లోనూ దీనికి సంబంధించిన అకౌంట్లు హల్‌చల్ చేస్తున్నాయి. అనే అకౌంట్.. “వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించిందో, మేము ఆ సామాన్య ప్రజల గొంతుకను” (జిన్హే సిస్టమ్ నే కాక్‌రోచ్ సంఝా, హమ్ ఉన్హీ అవామ్ కీ ఆవాజ్ హైన్) అని రాసుకొచ్చింది. అలాగే ‘కాక్‌రోచ్ అవామీ లీగ్ పాకిస్థాన్’ అనే మరో పేజీ.. “ఏ పరిస్థితిలోనైనా మేము బతికే ఉంటాం” (హర్ హలాత్ మే జిందా హైన్) అనే ఉర్దూ నినాదాన్ని వాడుతోంది. భారత్‌లోని కాక్‌రోచ్ జనతా పార్టీకి ఒక స్పష్టమైన వ్యవస్థాపకుడు, మ్యానిఫెస్టో, అఫీషియల్ వెబ్‌సైట్ ఉన్నాయి. కానీ పాకిస్థాన్‌లోని గ్రూపులు మాత్రం ఇంకా విడివిడిగా, రకరకాల క్రియేటర్ల ద్వారా నడుస్తున్నాయి. ఏదేమైనా.. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకుని బతికే ‘బొద్దింక’ను ఒక సింబల్‌గా వాడుకుంటూ, ఇరుదేశాల యువత తమ దేశాల్లోని నిరుద్యోగం, పాలనా లోపాలపై డిజిటల్ రూపంలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై కేసు నమోదు
కర్నూలు: నంద్యాల జిల్లాకు చెందిన వైకాపా నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దార్థరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైకాపా నేతలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్ని బైరెడ్డి.. మంత్రిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్ రూ.45 కోట్లు లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భరత్... బైరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై పరువు నష్టం దావా కూడా వేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలుఈ కేసులపై జరిపిన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకిరాజస్థాన్ :ఇటీవల దేశంలో చోటుచేసుకున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాయి. అధికారులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రైలు అగ్నిప్రమాదాల వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని భారతీయ రైల్వే పేర్కొంది. ఇటీవల రాజస్థాన్‌లోని అమరపురా, కోటాలో, అలాగే బీహార్, బెంగాల్‌లోని ససారం హౌరాలో రైలు అగ్నిప్రమాదాలు జరిగాయని గమనించాలి. ఈ కేసులపై జరిపిన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.రైల్వే ప్రకారం, అమరపుర ఘటనలో పరుపు దుప్పట్లకు (బెడ్డింగ్‌కు) నిప్పు పెట్టే ప్రయత్నం జరిగింది. హౌరా కేసులో, ఒక కోచ్ బాత్రూమ్ నుండి పెట్రోల్‌లో తడిపిన గుడ్డను స్వాధీనం చేసుకున్నారు. కోటాలో, రాజధాని ఎక్స్‌ప్రెస్ బాత్రూమ్ నుండి మంటలు రావడం కనిపించగా, ససారంలో గుర్తు తెలియని వ్యక్తి ఖాళీ కోచ్ లోపలికి మండుతున్న వస్తువును విసిరినట్లు తెలిపారు.ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ విజ్ఞప్తి :బీహార్‌లో ససారం-పాట్నా ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో, ప్రయాణికులు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని రైల్వే శాఖ కోరింది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేయాలని సూచించింది. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన కొద్ది రోజులకే రైల్వే ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 68 మంది ప్రయాణికులతో వెళ్తున్న బి-1 కోచ్‌లో ఉదయం 5:15 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. విక్రమ్‌గఢ్ ఆలోట్, లూని రిచ్చా స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నిరసనలు హాస్యాస్పదం
రోడ్లు వెయ్యకుండా రోడ్డు టాక్స్ పేరుతో సెస్ వసూలు చేసిన ఘనత వైయస్ జగన్ ది.. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.కొత్తపేట : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసనల పేరుతో వైసిపి నాయకులు రిక్షాలు తొక్కి ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మంగళవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు జగన్ పాలనలో డీజిల్ రేట్లు 22 నుంచి 27 శాతానికి, పెట్రోల్ రేట్లు 31 నుంచి 35 శాతానికి పెరిగాయన్నారు. వైసీపీ పాలన ఐదేళ్లలో ఒక్క లీటర్ పెట్రోల్ ధర 2019 తో పోలిస్తే 41 రూపాయలు పెరిగిందన్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో పాటు వైసిపి ప్రభుత్వం సైతం సెస్ పేరుతో పెట్రోల్ ధరల భారాన్ని ప్రజలపై వేసిందన్నారు. ఈ సందర్భంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ నిరసన తెలియజేస్తే అప్పటి మంత్రి కొడాలి నాని ఏకవచనంతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై నిరసనలు తెలియజేస్తే వెళ్ళి కేంద్రం వద్ద చేయాలి కానీ రాష్ట్రంలో చేస్తారా? అంటూ దుర్భాషలాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయన్నారు. ఇప్పుడు పెరిగిన ధరలు ఎవరు పెంచారో వైసీపీ నాయకులు గమనించకుండానే రిక్షాలు తొక్కడం సరైనదేనా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్రోల్ ధర గాని డీజిల్ ధర కాని పెంచలేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో దేశంలోనే అత్యధికంగా పెట్రోల్,డీజిల్ రేట్లు మన రాష్ట్రంలో పెరిగాయన్నారు. ఒక్క రోడ్డు కూడా నిర్మించకుండా, గుంతలయినా పూడ్చకుండా రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతో పెట్రోల్, డీజిల్ పై పన్నులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చితే అప్పట్లో మన రాష్ట్రంలోనే లీటరుకు రూ.5నుంచి రూ.10 వరకు ధరలు అధికంగా ఉండేవన్నారు. అటువంటిది ఇప్పుడు డ్రామాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఎందుకు పెరిగాయో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య జరిగిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు. ప్రతిపక్షంగా ఏదో తమ ఉనికి కాపాడుకోవడం కోసం ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారన్నారు. ఈ అంశాలన్నీ ప్రజలు పరిశీలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు డ్రామాలు కట్టి పెట్టాలన్నారు. లేకుంటే వారు మరింతగా ప్రజల్లో పలచన అయ్యే అవకాశం ఉందన్నారు.
పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్‌బోర్డులు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి : అమరావతిలో పంచాయతీరాజ్ మరియు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, పారదర్శకత, రోడ్ల నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థలు చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు స్పష్టంగా తెలియాలంటే ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులు, వాటి పురోగతి, రోడ్ల పరిస్థితి వంటి వివరాలు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేయడం అభినందనీయమని పవన్ పేర్కొన్నారు. పంచాయతీలు తమ ఆదాయ వనరులను మరింత పెంచుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచ
హస్తనలో చంద్రబాబు బిజీబిజీ
---అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు---సీఐఐ బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్న సీఎంఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం.. పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర సహకారం వంటి అంశాలపై ఈ భేటీల్లో చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక ప్రాజెక్టులు, నదుల అనుసంధానం, జలవనరుల అభివృద్ధి, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సహాయంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర భద్రత, పరిపాలన, అభివృద్ధి అంశాలపై కూడా అమిత్ షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థిక సహకారం, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకు మద్దతుతో అమలు చేయదగిన పలు ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్‌లో నిర్వహించే సీఐఐ బిజినెస్ సమ్మిట్లో సీఎం పాల్గొననున్నారు. దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై సీఎం ప్రసంగించనున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తారని అధికారులు చెబుతున్నారు.ఇక ఈరోజు రాత్రి ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు గౌహతి (అస్సాం)కు బయల్దేరనున్నారు. అక్కడ జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి కీలకంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు
తమిళనాడు : తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే సత్తా చాటుతోంది. దీంతో గెలుపు అవకాశాలు కనిపిస్తున్న వేళ ఆ పార్టీ అధినేత విజయ్ ఇంటివద్ద అధికారులు భద్రత పెంచారు. ప్రస్తుతం విజయ్ పార్టీ 90కు పైగా స్థానాల్లో అధిక్యంలో హవా కొనసాగిస్తోందిఈనేపథ్యంలో విజయ్ ఇంటి వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇతర వాహనాలను ఆయన ఇంటివైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు తాజా ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం విజయ్ నేతృత్వంలోని తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే అనూహ్యరీతిలో రాణిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఈ స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
70 వార్డు ప్రజలకు ఎప్పుడు ఋణ పడి ఉంటా : ఉరుకూటి చందు
20 కోట్ల రూపాయల నిధులతో వార్డును అభివృద్ధి చేశా హామీలన్నీ నెరవేర్చి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నాగాజువాక ( న్యూస్ వన్ ప్రతినిధి ) మర్చి 18 : విశాఖ, గాజువాక జివిఎంసి 70 వార్డు లో 2 కోట్ల 58 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు కార్పొరేటర్ ఉరుకూటి చందు శంకుస్థాపన శ్రీకారం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నిధులతో శ్రామిక నగర్,శ్రీనివాస్ నగర్,టివిఎన్ కాలనీ లలో సిసి రోడ్లు,డ్రైన్లు మరియు LBS నగర్,డ్రైవర్స్ కాలనీ,చిట్టినాయుడు కాలనీ,దశమి కొండ కాలనీ లలో రక్షణ గోడలు,మెట్లు,రోడ్లు,డ్రైన్లు నిర్మిస్తామని తెలిపారు.5 ఏళ్లలో వార్డు లో 20 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేశానని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కొణతాల రాము,నీలాతి అచ్చిబాబు,పాలఘాట్ కృష్ణ,బాబులు నాయుడు, రాజు,నాయుడు,ఆచారి,రంగాల పైడిరాజు,పల్లా రమణ,భోగి జనార్ధన్,సమ్మెట శ్రీను,నాగరాజు,మోహన్ కృష్ణ,శ్రామిక నగర్ ప్రెసిడెంట్ గొన్న బుజ్జి,స్టీల్ ప్లాంట్ అప్పారావు, చంటి ,అప్పలనాయుడు, సత్యారావు, విజయకుమార్,దేవుడు బాబు,రాజ్యలక్ష్మి,రమణమ్మ,వెంకటలక్ష్మీ,వాణి,విజయలక్ష్మి,కామేశ్వరి,రత్నం తదితరులు పాల్గొన్నారు.